Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబోయే పోలీసు బాసులు.. సాధారణ పరీక్షల్లో ఫెయిల్.. 122 మందిలో ముగ్గురే పాస్!

  • పోలీస్ అకాడమీ పరీక్షల్లో దాదాపు అందరూ ఫెయిల్
  • మూడు అవకాశాలిచ్చిన అధికారులు
  • పాస్ కాకుంటే ఇంటికే
వారంతా భవిష్యత్ పోలీసు బాసులు. ఐపీఎస్ అధికారులుగా శిక్షణ పొందుతున్న వారంతా సాధారణ పరీక్షల్లో ఫెయిలయ్యారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో 2016 బ్యాచ్ పోలీసులు 122 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో 119 మంది అకాడమీ పరీక్షల్లో ఫెయిలయ్యారు. వీరిలో ఎక్కువమంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలవడం గమనార్హం. మొత్తం బ్యాచ్ 136 మంది కాగా, అందులో 14 మంది ఫారెన్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన వారు.

ఎగ్జామ్స్‌లో ఫెయిలైన వారిని కూడా అధికారులు గ్రాడ్యుయేట్లను చేశారు. ఇప్పుడు వారంతా వారి వారి కేడర్లను బట్టి ప్రొబేషనరీలో ఉంటారు. అయితే, వారు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడుసార్లు అనుమతిస్తారు. ఆ తర్వాత కూడా ఉత్తీర్ణత కాకుంటే సర్వీసుకు వారు అనర్హులవుతారు.

ఐఏఎస్ ఆఫీసర్లకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ ఇస్తుండగా, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌లోని ఎస్‌వీపీఎన్‌పీఏ శిక్షణ ఇస్తున్నారు.  
Hyderabad
IPS
svpnpa
Exams

More Telugu News